హాజరైన మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి , కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్
నేటి సాక్షి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి
ఉప్పల్ పోచమ్మ అమ్మవారికి కుమ్మరుల తొలి బోనం సమర్పణ కార్యక్రమానికి ఉప్పల్ మాజీ చైర్మన్ మేకల శివారెడ్డి, చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉప్పల్ కుమ్మరి సంఘం పెద్దలతో కలిసి ఈ సందర్భంగా కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ పోచమ్మకు ప్రత్యేక పూజ లో పాల్గొన్నారు .
అనంతరం కార్పోరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఉప్పల్ కుమ్మర్లు పోచమ్మ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తున్నదని, కానీ ప్రతి సంవత్సరం ఉప్పల్ కుమ్మరులు అమ్మవారికి మొదటి బోనం గోలుకొండలో సమర్పించే వారిని, కానీ ఈ సంవత్సరం నుండి పోచమ్మ అమ్మవారికి తొలి బోనం ఉప్పల్లోనే సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సంవత్సరం నుండి కుమ్మరుల తొలి బోనం ఉప్పల్ పోచమ్మ అమ్మవారికి ఉప్పల్లోనే సమర్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గుమిడెల్లి నారాయణ ,గుమిడెల్లి మల్లేష్,గుమిడెల్లి యాదయ్య భాస్కర్ ,బుల్లెట్ కృష్ణ,గుమిడెల్లి రాజు,గుమిడేలి మహేష్,పొట్లూరి కృష్ణ,పొట్లూరి వెంకటేష్,పొట్లూరి శ్రీనివాస్,మహేష్,సదాసాయి భిక్షపతి,గుమిడేలి శ్రీనివాస్,గుమిడెల్లి అశోక్,నర్సింహ,మశెట్టి రాఘవేంద్ర,సాయి,రవి,ఉపేందర్, పెద్ద ఎత్తున మహిళలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కోకొండ జగన్, ముద్దం శ్రీనివాస్ యాదవ్,బింగి శ్రీనివాస్, మార్క శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్, గణేష్, శ్యామ్, నర్సింగ్ నేత కుమార్, బాలు తదితరులు పాల్గొన్నారు.





