నేటిసాక్షి, మిర్యాలగూడ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో ఘన విజయం నేపథ్యంలో, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారంకాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించి, ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు జరుపుకుని, రాజీవ్ భవన్ నుండి ర్యాలీగా బయలుదేరి రాజీవ్ రాజీవ్ గాంధీ చౌరస్తాలో బాణాసంచాలు కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరినై కాబట్టే, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తెలియజేశారు. గత ప్రభుత్వం పేద ప్రజలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులుచిరుమర్రి కృష్ణయ్య, పొదిల శ్రీనివాస్, ముదిరెడ్డి నర్సిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు నాగు నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య గౌడ్, సలీం ఆరిఫ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్, బెజ్జం సాయి, ఉబ్బ పెళ్లి కాశయ్య రమేష్ నాయక్, బూడిద సైదులు, సిద్దు నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇంఛార్జీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళా నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.





