Tuesday, January 20, 2026

*ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు* *జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్*———————————————

నేటి సాక్షి – జగిత్యాల(పూరెళ్ల బాపు)……………………………………….ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లనుజిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు.హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ రూట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన ముఖ్య ప్రదేశాలు తదితర అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు.పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమావేశమై, బందోబస్తు పరంగా చేపట్టాల్సిన చర్యలపై పలు కీలక సూచనలు చేశారు.ఉప ముఖ్యమంత్రి పర్యటన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల రాకపోకలు సజావుగా నిర్వహించాలని, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎస్పీ ఆదేశించారు.ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News