నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 17) : ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ అండర్ 19 జిల్లా స్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి ద్వితీయ స్థానం సాధించడం జరిగింది అని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 14న కరీంనగర్ లోని శ్రీ చైతన్య డిఫెన్స్ అకాడమీలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలలో ధర్మారం మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించడం పట్ల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు జి.పూజ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు వీరిని ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు బైకనీ కొమురయ్య మేకల సంజీవరావు విద్యార్థులను అభినందించడం జరిగింది.




