నేటి సాక్షి, అన్నమయ్య మదనపల్లి జిల్లా, శర్మ ÷మదనపల్లి జిల్లా -:- తెలుగు రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి. గురువారం రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాలు సందడిగా మారాయి. కఠిన ఆంక్షల మధ్యే యువత వేడుకలను జరుపుకుంది. ఇక నూతన సవంత్సరం సందర్భంగా తెలుగు వారికి ప్రముఖులంతా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ఆర్సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్ద రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి లు ఏడాది ఆరంభమైన తరుణంలో ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజలకు, మరియు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్లకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2026 సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. 2026లో ప్రతి ఇంటా సుఖ శాంతలు వెల్లివిరియాలని 2026 ప్రతి ఒక్కరి ఇంట్లో ఆనందం నింపాలన్నారు. ఈ ఏడాది అందరికీ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అందించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ కొత్త ఆశలు ఆకాంక్షలతో ఉత్సాహంగా నూతన ఆంగ్ల సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో ఉమ్మడి రాష్ట్రాల, ప్రపంచ దేశాల తెలుగు ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుంటూ వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ భవిష్యత్తుకు సరైన ప్రణాళికలు రక్షించుకోవడం ద్వారానే గుణాత్మక మార్పులు సాధ్యమవుతుందని వైయస్ జగన్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువత తనకంటూ స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని వృధా సంకల్పంతో సాధన అడుగులు వేయాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విష్ చేశారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరిగేలా భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని నిండు మనస్సుతో కోరుకుంటున్నానని పెద్దిరెడ్డి తెలిపారు. నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో మంచి మార్పులకు దారి తీయాలని ఆయన కోరుకున్నారు. ఈ నూతన సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన అందించాలని విలువలు లేని అవకాశవాదుల నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలని రాజకీయాల్లో, పరిపాలనలో కొత్త ధోరణికి నూతన సంవత్సరం శ్రీకారం చుట్టాలని ఎన్నికల హామీల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు & కో ఇచ్చిన వాగ్దానాలకు నెరవేర్చేలా మంచి బుద్ధి ప్రసాదించాలని పెద్దిరెడ్డి కోరుకున్నారు. కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో, కొత్త అవకాశాలను అన్వేషించి లక్ష్యాలను సాధించడానికి స్పూర్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలని, అభివృద్ధి కాంతులు విరజిల్లాలని కోరుకున్నారు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అభిలషించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు నూతన ఏడాది సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను, సిరిసంపదలను ఇవ్వాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామన్నారు. నూతన సంవత్సరంలో ప్రజదలందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ద్వారకానాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గత పదేళ్లుగా నాకు అండగా ఉంటూ నాపై మీరు చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగువాడిని నిపుణతగల విశ్వమానవుడిగా తీర్చిదిద్దే బృహత్కార్యానికి పేదరికానికి, అసమానతలకు తావులేని నవశకానికి నాంది పలుకుదామని కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూన్నానని పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నారు..~~~~~~~~~~~~~~~~~

