Saturday, March 21, 2026

*ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య వర్ధంతి వేడుకలు*

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్‌గా ఆర్థిక మంత్రి గా ప్రజాసేవకుడిగా దీర్ఘకాలం సేవలందించిన కొణిజెటి రోశయ్య వర్ధంతి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీసు అధికారులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.సందర్బంగా సీపీ మాట్లాడుతూ… రోశయ్య రాజకీయ ప్రస్థానం నిస్వార్థ ప్రజాసేవ సాదాసీదా జీవన పద్ధతి పరిపాలనా నైపుణ్యం వంటి అంశాలను స్మరించుకున్నారు. ప్రజలకు అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. సమాజ సేవలో ప్రజా సంక్షేమంలో రాజకీయ నాయకులు చూపాల్సిన నైతిక విలువలు, పారదర్శకత, వినయశీలత వ్యక్తిత్వంలో అభివృద్ధి చెందిన కీలక లక్షణాలు అని సీపీ గుర్తు చేశారు. కొణిజేటి రోశయ్య నిరంతనం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, మహనీయులు ఆశలను సాధించేందుకు ప్రతి ఒక్కరి తమవంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఎ ఓ శ్రీనివాస్, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఆర్ ఐ లు, సీపీఓ సిబ్బంది, వివిధ విభాగాల పోలీసు సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News