*నేటి సాక్షి-మేడిపల్లి* మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కొక్కెర గంగామణి w/o అంజయ్య, 29 yrs, యాదవ కులానికి చెందిన మహిళకు 10 సం. ల క్రితం వివాహమైనది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు సంతానం. కొడుకు వేదాన్ష్ కి ఆటిజం ( మంద బుద్ధి) ఉండడంతో గత ఐదు సంవత్సరాల నుంచి కొడుకు ఆరోగ్యం బాలేదని బాధపడుతూ, మానసిక ఆవేదన గురై జీవితం మీద విరక్తి చెంది ఈరోజు 07/03/2026 తెల్లవారుజామున 3 గం. ప్రాంతంలో ఆమె నివసిస్తున్న ఇంట్లోనే ఒక రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని చనిపోయినది అని మృతురాలి తండ్రి కాసాడి నడిపి గంగారం r/o తక్కలపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





