నేటి సాక్షి* : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామానికి చెందిన తనుగుల శివకుమార్ తండ్రి మొండయ్య వయస్సు 33 సంవత్సరాలు అను ఆతడు గత నాలుగు సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంకు వెళ్ళిండు అక్కడ సంవత్సరం తర్వాత అనారోగ్య కారణంగా మనస్థిమితం కోల్పోగా అక్కడి వారి సహాయంతో సొంత గ్రామానికి వచ్చిండు గ్రామానికి వచ్చినంక కూడా అదే విధంగా మతిస్థిమితం కోల్పోగా హాసుపత్రిలో చికిత్స చేయించిన కూడా మంచిగా కాలేదు ప్రస్తుతం మందులు వాడుతున్నాడు గురువారం రోజున ఇంట్లో ఎవరు లేని సమయం లో మధ్యాహ్నం జీవితంపై విరక్తి చెంది ఇంట్లో స్లాబు కు ఉన్న ఫ్యాను ఉక్కుకు నైలాన్ త్రాడుతో ఉరివేసుకొని చనిపోయినాడు అని మృతుని తల్లి తనుగుల వీరమ్మ ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై ఆర్ ఉమాసాగర్ తెలిపారు.




