*నేటి సాక్షి, ఎండపల్లి:* జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో గురువారం రాత్రి చలి తీవ్రత కాస్త తగ్గినా శుక్రవారం ఉదయం వరకు మండలాన్ని పొగమంచు కమ్ముకుంది. రాయపట్నం-కరీంనగర్ రహదారి వెంట నడుస్తున్న వాహనాలు పొగమంచు కారణంగా పొద్దంతా కూడా లైట్లు వేసుకుని వాహనాలు నడిపే పరిస్థితి నెలకొనడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు తీవ్రత కొనసాగింది. ఉదయం 10 గంటలకు కూడా సూర్య కిరణాలు పలకరించక పోవడంతో పర్యావరణ ఆస్వాదకులు పడిగాపులు కాశారు. ఆంగ్ల కొత్త సంవత్సరంలో ఎండపల్లి మండల ప్రజలకు ఇదో కొత్త అనుభవం ఎదురైంది.

