Saturday, March 14, 2026

ఎంపీపీ పాఠశాల బెజ్జంకిలో హ్యాండ్‌వాష్‌పై అవగాహన కార్యక్రమం- విద్యార్థుల్లో పరిశుభ్రత ప్రాముఖ్యతపై ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సూచనలు.

నేటి సాక్షి, బెజ్జంకి:మండల పరిధిలోని ఎంపీపీఎస్ బెజ్జంకి పాఠశాలలో హ్యాండ్‌వాష్‌ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సబ్బుతో చేతులు కడగడం ఎంత ముఖ్యమో, ఆహారం తినే ముందు చేతులు శుభ్రంగా కడగకపోతే వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ఏఎన్ఎం అనిత, ఆశా వర్కర్లు విద్యార్థులకు వివరించారు.అలాగే ఆరోగ్యంగా జీవించాలంటే పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చేతులు శుభ్రం చేసుకునే సరైన విధానం విద్యార్థులకు ప్రదర్శనగా చూపించారు. ఆహారం తినేటప్పుడు అయోడైజ్డ్ ఉప్పు ఉపయోగించాలని కూడా సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు నా రోజు శంకరాచారి, సిహెచ్. మంజుల, ఏఎన్ఎం అనిత, ఆశా వర్కర్లు బి. భాగ్యలక్ష్మి, వెంకటలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News