నేటి సాక్షి నవంబర్ 20 నంద్యాల:– శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణ కోసం, నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షారాణ్ కు ఒక బొలెరో నియో వాహనాన్ని తన ఎంపీ నిధులతో అందజేయడం జరిగిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.గురువారం నంద్యాల జిల్లా కార్యాలయంలో అనంతరం పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి లాంచనప్రాయంగా జెండా ఊపి బొలెరో నియో వాహనంను ప్రారంభించారు. తదనంతరం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా ఎస్ పి సునీల్ షోహణ్ లు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజా భద్రతను మెరుగుపరచడానికి, పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ఈ వాహనాన్ని అప్పగించామన్నారు. ఈ వాహనం ప్రత్యేకంగా పెట్రోలింగ్, చిన్న పిల్లలు, మహిళల భద్రత, అత్యవసర కాల్ల కోసం ఏర్పాటు చేయబడిందనీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ సేవలను రూపొందించిందనీ, అంటే పాఠశాలలు, కళాశాలలలో పెట్రోలింగ్, ఈవ్-టీచింగ్, లైంగిక వేధింపులు, బలవంతపు బాల్య వివాహం, గృహ హింస బెదిరింపులు తదితరవాటిని, ఈ వాహనాన్ని పోలీసు అధికారులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని బాధితులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తారన్నారు.





