నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 12 ~అన్నమయ్య జిల్లా :-: రైల్వే కోడూరు మండల కేంద్రమైన అనంతరాజుపేట – రామయ్య పాలెం గ్రామాలకు గాను 30 లక్షల రూపాయల వ్యయంతో కల్వర్టు నిర్మాణం తో పాటు సీసీ రోడ్డు కొరకు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, మాజీ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరుముట్ల శ్రీనివాసులు సహకారం అందించారు. దీంతో గ్రామాలకు రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణం పనులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పంజం వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ పాలెం కోట రత్నమ్మ శుక్రవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నో సంవత్సరాల కల నేటితో నెరవేరిందని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని వీళ్ళ సహకారంతోనే ఇరు గ్రామాలకు వెళ్లేందుకు కల్వర్టు మరియు సీసీ రోడ్డు సౌకర్యం సుగమమైందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీలు పం దేటి జనార్దన్ రాజు, బండారు మల్లికార్జున, మిట్టమీద పల్లె వార్డు మెంబర్ మాధవ, వైసీపీ శ్రేణులు, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~





