నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎంసిఎంసి కేంద్రం, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్, ఎంసిసి కంట్రోల్ రూమ్ మరియు ఫిర్యాదు సెల్‌లను పరిశీలించారు.*ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి*ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా సాగాలన్న ఉద్దేశంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి)ను కఠినంగా అమలు చేయాలని రాజగౌడ్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌కి వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందనతో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు.*మానిటరింగ్ సిస్టమ్ పనితీరు సమీక్ష*ఫిర్యాదు రిజిస్టర్లు, డిజిటల్ డాక్యుమెంటేషన్, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలను అధికారులతో కలిసి సమీక్షించిన అదనపు కలెక్టర్..రికార్డింగ్, రిపోర్టింగ్, స్పందన వ్యవస్థలు సమర్ధవంతంగా సాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.*24×7 మానిటరింగ్ కొనసాగుతుంది*ఎంసిఎంసి, ఎసిసి సిబ్బంది 24×7 పనిచేస్తూ ఎన్నికల సమయంలో వచ్చే ఎలాంటి వివాదాలను, ఫిర్యాదులను తక్షణమే సంబంధిత విభాగాలకు పంపి చర్యలు నిర్ధారిస్తున్నట్లు అధికారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో డిపివో రఘువరన్, ఎంసిఎంసి నోడల్ అధికారి పి.నరేష్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.—




