నేటి సాక్షి – కోరుట్ల
అవ్ని ఆస్పత్రి నిర్వాహకులు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హేమ రెడ్డి (నిత్యసాయి హాస్పిటల్, మెట్ పల్లి) ఎక్సలెన్స్ గ్లోబల్ ఐకాన్ సెకండ్ ఎడిషన్ అవార్డును అందుకున్నారు.
2024 సంవత్సరానికి గాను ఇన్ ఫెర్టిలిటీ, ఆండ్రాలజీ విభాగాల్లో విశేష సేవలు అందించినందుకు గాను దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉత్తమ అవార్డును అందుకున్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ హేమ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఇన్ ఫెర్టిలిటీ, ఆండ్రాలజీ విభాగాల్లో విశిష్టమైన సేవలను అందిస్తున్నారు. ఎంతోమంది ప్రజల సంతాన ఉత్పత్తి సమస్యలను పరిష్కరిస్తూ మెరుగైన వైద్య సేవలను అందించారు. వారి సేవలను గుర్తించిన గ్లోబల్ ఐకాన్ సంస్థ నిర్వాహకులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇన్ ఫెర్టిలిటీ, ఆండ్రాలజీ విభాగాల్లో విషశ ప్రతిభ కనబరిచి అవార్డును అందుకున్న గైనకాలజిస్ట్ డాక్టర్ హేమరెడ్డిని పలువురు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.