Wednesday, March 18, 2026

ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరు..జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా – సుగవాసి ప్రసాద్ బాబు

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 16 ~అన్నమయ్య జిల్లా :-: టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబును నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు తనయుడైన ఆయన ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుదీర్ఘకాలంగా పార్టీలో కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈ పదవి వరించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఆయన అన్న సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేటలో ఓటమి అనంతరం ఇటీవల వైసీపీలో చేరిపోయి అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో – రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లె ప్రాంతాలకు అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు గర్విస్తున్నానని నాపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అలాగే మంత్రి నారా లోకేష్ బాబు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని సుగవాస ప్రసాద్ బాబు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో టీడీపీ కి పునర్వైభవం తీసుకొస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నిరంతరం ప్రజల్లో గడుపుతానని ప్రజా సమస్యలపై కృషి చేస్తానని సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా నూతన అధ్యక్షులు గా సుగవాసి ప్రసాద్ బాబు ఎంపిక కావడంపై టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్& కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు & గుట్ట బాబు ఆధ్వర్యంలో ఆయనకు దుశ్శాలువలు కప్పి పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని ప్రీతం రెసిడెన్సీ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నూతనంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలతో ముంచెత్తారు. శివప్రసాద్ నాయుడు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా తెలుగుదేశం పార్టీని అంటబెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజల్లోకాని, కార్యకర్తల్లో కానీ ఏదైనా సమస్యలుంటే నేనున్నానంటూ భరోసా కల్పించిన ఏకైక వ్యక్తి సుగవాసి ప్రసాద్ బాబు అని కొనియాడినారు.ఈ కార్యక్రమంలో గోళ్ళ క్రిష్టమ నాయుడు, రాపూరి రవికుమార్, నవీన్ కుమార్, దొరబాబు, మన్నేరు రాజశేఖర్, మన్నేరు రామాంజులు, బడిశెట్టి రవి ప్రవీణ్ కుమార్ రాజు, వాకావాసు, సర్పంచ్ వాసు,గాలివీటి ప్రభాకర్ నాయుడు, ముద్దుశెట్టి రామయ్య, రెడ్డి చైతన్య, శ్రీనివాసరాజు, రామాంజులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News