నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారం లో మరో అడుగు ముందుకేసింది. మదనపల్లి పట్టణ పరిధి పరిధిలోని ఎస్బిఐ కాలనీలో గల గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం గుట్టు రటైన విషయం తెలిసిందే. ఈ కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటికే మదనపల్లి పోలీసులు గత నెలలో ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. కాగా ఇప్పటి వరకు ఆసుపత్రిని సీజ్ చేయలేదన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఉత్తర్వుల మేరకు గురువారం ఉదయం మదనపల్లి ఎస్బిఐ కాలనీలోని గ్లోబల్ ఆస్పత్రిని మదనపల్లి డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో మెడికల్ సిబ్బంది ఆధ్వర్యంలో సీజ్ చేశారు. గత నెల 9న అన్నమయ్య జిల్లా మాజీ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు, గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా విశాఖపట్నం కు చెందిన ఓ బాధితురాలి కిడ్నీలను తొలగించి విక్రయించారన్నా అభియోగాలపై వైద్యులు ఆంజనేయులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విశాఖ కు చెందిన యమున అనే మహిళ కు చెందిన కిడ్నీలను తొలగించే క్రమంలో ఆమె మృత్యువాత పడింది. ఈ ఘటనకు సంబంధించి వాళ్ల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు కిడ్నీ వ్యవహారాన్ని గుట్టురట్లు చేశారు. మదనపల్లె రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, కేసులో కీలక పాత్ర పోషించిన ఏ వన్ ముద్దాయి డాక్టర్ ఆంజనేయులు తో పాటు కిడ్నీలు తొలగించడంలో సిద్ధహస్తుడైన బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి, మదనపల్లి డయాలసిస్ కేంద్రం మేనేజర్ బాలరంగడు అలియాస్ బాలు, కదిరి డయాలసిస్ మేనేజర్ మెహరాజ్, అలాగే విశాఖకు చెందిన పెళ్లి పద్మ, కాకర్ల సత్య యమున ప్రియుడు సూరిబాబు, బెంగళూరు గోవాలకు చెందిన మరికొందరిపై కేసులు నమోదు చేసి, ఏడుగురిని అప్పట్లో అరెస్టు చేశారు. ఈ కేసులో కోర్టు ఉత్తర్వుల మేరకు సీన్ రీ కంస్ట్రక్షన్ చేశారు. సీన్ రీ కంస్ట్రక్షన్ చేసిన అనంతరం మెడికల్ అధికారుల ఆధ్వర్యంలో మదనపల్లి డీఎస్పీ పర్యవేక్షణలో గ్లోబల్ ఆస్పత్రిని రెవెన్యూ, కోర్టు సిబ్బంది సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేంద్ర వెంట రెండవ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..~~~~~~~~~~~~~~~~~~





