నేటి సాక్షి నారాయణపేట, డిసెంబర్ 16,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని ఏ క్లాస్ పూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన పి హనుమంత్ రెడ్డికి గ్రామస్తుల ఆధ్వర్యంలో పూలమాలతో శాలువాలతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం నాడు గ్రామంలో స్థానిక విలేకరులతో ఈ సందర్భంగా సర్పంచ్ పి. హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పారిశుద్ధ పనులు ఇందిరమ్మ గృహాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఎట్లాస్పూర్ గ్రామానికి ఇందిరమ్మ గృహాలు మంజూరుకు కృషి చేస్తానన్నారు. గ్రామ సమస్యలను గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఎట్లాస్పూర్ గ్రామ సర్పంచ్గా తనను ఎన్నుకున్నందుకు ఏ క్లాస్ పూర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ ఈ సమావేశంలో ఎట్లాస్పూర్ గ్రామ ఉపసర్పంచ్ రామేశ్వరమ్మ,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు





