నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి అక్టోబర్ 28మంతా తుఫాన్ మూలంగా మండలంలోని పలు చెరువులు కుంటలు నిండుకుండలా మారాయి ఈ క్రమంలో గడ్డం వారి పల్లి పంచాయతీ తెల్ల నీళ్లపల్లి సమీపంలోని ఎదలకుంట తుఫాన్ ప్రభావం మూలంగా నిండుకుండలా మారింది మరవ నీరు ప్రమాద పరిస్థితుల్లో ఉండగా వెంటనే స్పందించిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి కుంటను సందర్శించారు యుద్ధ ప్రాతిపదికన కుంటకు కల్వర్టును ఏర్పాటు చేసి నీటిని దిగువ ప్రాంతానికి సురక్షితంగా వెళ్లే ఏర్పాటు చేశారు దీంతో చెరువు మొరవా ప్రమాదం తప్పింది అదేవిధంగా మండల వ్యాప్తంగా ఎలాంటి ప్రమాదం సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారికి గువ్వల రమేష్ రెడ్డి సూచించారు తెల్లనీలపల్లి ఎద్దలకుంట కల్వర్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ప్రమాదం నుంచి బయటపడేసిన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డికి రైతులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు





