నేటిసాక్షి, నల్లగొండ : పట్టణంలోనినాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి )లో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాసులు అధ్యక్షతన ప్రభుత్వ పాలన విభాగశాఖ ఆధ్వర్యంలో గురువారంహయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ పాలన శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా. గీతా నాయక్ విస్లావత్ “న్యూ పబ్లిక్ మేనేజ్ మెంట్”అనే అంశంపై విద్యార్థులకు విస్తృత ఉపన్యాసాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆర్ధిక సంస్కరణలో భాగంగా సాంప్రదాయ పద్ధతులను వదిలేసి ఆధునిక పద్ధతులు అనుసరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరిగి, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతుందని అని అన్నారు.ఈ కార్యక్రమంలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ మునిస్వామి, అకాడమిక్ కో-ఆర్డినేటర్ బత్తిని నాగరాజు, చరిత్ర శాఖ విభాగాధిపతి డాక్టర్ బట్టు కిరీటం,రాజనీతి శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ అదే మల్లేశం, ప్రభుత్వ పాలన శాఖ విభాగాధిపతి మరియు చరిత్ర ఉపన్యాసకులు నర్సింగ్ కోటయ్య, ప్రభుత్వ పాలన శాఖ అధ్యాపకులు డాక్టర్ అంకూసు, మరియు ఇతర అధ్యాపకులు ఎండీ హబీబ్, కే నాగరాజు, జె దినేష్, హస్రత్ బేగం, మరియు ప్రభుత్వ పాలనా శాస్త్ర విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





