నేటిసాక్షి, నల్లగొండ : పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో ఐసియస్ యస్ ర్ – యస్ ర్ సి మరియు పి ఎమ్ ఉషా వారి ఆర్థిక సహకారంతో రెండు రోజుల జాతీయ సదస్సును “వికసిత్ భారత్ 2047, స్ట్రాటజీస్ అండ్ చాలెంజెస్”* అనే అంశం పైన నేడు 08-01- 2026 నుండి రేపు 09- 01- 2026 వరకు రెండు రోజులు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.సముద్రాల ఉపేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో సెమినార్ ను రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సెమినార్ కు వివిధ రాష్ట్రాల్లో ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు మరియు రాష్ట్రస్థాయి విశ్వవిద్యాలయాలు అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్సు తదితరులు పరిశోధనాత్మక వ్యాసాలు రాసి వాటిని సెమినార్ లో ప్రజెంట్ చేస్తారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

