Monday, March 9, 2026

*ఎన్టీఆర్ నగర్ కాలనీలో.. పారిశుద్ధ్య పనులు..*—+* ‘99 రోజుల ప్రణాళిక’లో భాగంగా డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు* మున్సిపల్ సిబ్బందితో కలిసి పనులు పర్యవేక్షించిన కౌన్సిలర్—-*

నేటి సాక్షి – కోరుట్ల* (రాధారపు నర్సయ్య)తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రణాళిక’లో భాగంగా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో సోమవారం అభివృద్ధి పనులు చేపట్టారు. వార్డు కౌన్సిలర్ సోరుపాక రమాదేవి రమేష్ మున్సిపల్ సిబ్బందితో కలిసి కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్ల మరమ్మతు పనులను పరిశీలిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.*పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి*కాలనీలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు మురుగు కాల్వలను శుభ్రపరిచే పనులతో పాటు రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చే పనులను చేపట్టారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని మున్సిపల్ సిబ్బందికి కౌన్సిలర్ సూచించారు.*ప్రజల సహకారం అవసరం*ఈ సందర్భంగా కౌన్సిలర్ సోరుపాక రమాదేవి రమేష్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ‘99 రోజుల ప్రణాళిక’లో భాగంగా ప్రతి వార్డులో శుభ్రత, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు._______

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News