Sunday, March 15, 2026

*ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లను పంపిణీ చేసిన వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ*. పాములపాడు నవంబరు 01..

నేటి సాక్షి : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేంపెంట గ్రామ సర్పంచ్ వై.మాణిక్యమ్మ మాట్లాడుతూ సుంకులమ్మ కొట్టాల గ్రామానికి చెందిన మొగిలి.పెద్దక్క, భర్త సుబ్బయ్య కు మరియు వేంపెంట గ్రామంలో మంజూరైన కొత్త పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వలన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఇంకా మిగతా వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అన్నారు. ఈ పెన్షన్ డబ్బులు వారి జీవనానికి, వైద్య ఖర్చులకు, మొత్తానికి వారిని కుటుంబ సభ్యులు, సంరక్షకులు ఆదరించడానికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్-వై.దానమయ్య, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News