నేటి సాక్షి 31 జనవరి పాములపాడు:- పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, ఎంపీడీవో కార్యాలయ ఏవో- ఎం.సరళ తో కలిసి పాల్గొని, సచివాలయ ఉద్యోగస్తులతో, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ, ఎంపీడీవో కార్యాలయ ఏఓ- ఎం.సరళ లు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి, ఫిబ్రవరి-1వ తేదీ ఆదివారం ఉన్నందున ఒకరోజు ముందుగానే సామాజిక ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడం గర్వకారణం అన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ డబ్బులను, ఈ ప్రభుత్వంలో పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని కారణంగా పెంచిన పెన్షన్ వలన ఎంతోమంది వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు ప్రతి ఒక్కరి జీవనోపాధికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు,నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్,బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్,బొమ్మ రాజేష్,వేమా రెడ్డి,రత్నాకర్, కిరణ్, ఎర్రసాని రాము,సుబ్బారావు,జీవన్న,సుధాకర్,రామచంద్రుడు, రాముడు, స్వాములు, వెంకటరమణ, స్వచ్ఛభారత్ ఎంసిఓ- కె.చెంచయ్య, పంచాయతి కార్యదర్శి పుల్లయ్య, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, తదితరులు పాల్గొన్నారు.





