Saturday, March 21, 2026

*ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: ఎస్సై**

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్):* ఎన్నికలుప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని గ్రామాల ప్రజలు సహకరించాలని వెల్గటూర్ ఎస్సై పి.ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మధ్యనిలువలు చేయొద్దని అమ్మకాలు జరపొద్దని బెల్ట్ షాపులు నిర్వహించవద్దని ఆయన సూచించారు. అభ్యర్థులు, యువత, గ్రామస్థులు ఎన్నికల రోజు గొడవలకు పాల్పడరాదని, ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి ఓటరు ఎలాంటి భయాందోళనలు, ఒత్తిళ్లకు గురి కాకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వెంటనే 100 డయల్ లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్ 8712656827 కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News