నేటి సాక్షి తొగుట.. వడ్డే నర్సింలుతొగుట మండలంలోని మల్లన్న సాగర్ నుండి దుబ్బాక కాలువలోకి నీళ్లు విడుదల కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వాళ్ళ అధికారులుకు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు నీళ్ళు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అన్నారు ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రెండు రోజుల ముందే నీటిని విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేసి మంత్రి షెడ్యూల్ ను ప్రకటించారు. కాని నిన్నటి రాత్రి ఏంఎల్ఏ మద్యం మత్తులో నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని అన్నారు.ప్రభుత్వమే ముందుగా రాబోయే వేసవి కాలన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని చెరువులు కుంటలకు నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.ఎన్నికల కోడ్ నిబంధనల వల్ల అధికారులు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, తొగుట AMC మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ రెడ్డి (అమర్), చేగుంట AMC మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు ,మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, సర్పంచ్‌లు ఫోరం అధ్యక్షులు పిట్ల సత్తయ్య,ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు అమరేందర్, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





