Thursday, March 19, 2026

ఎన్నికల నేపథ్యంలో నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల కవాత్

నేటి సాక్షి, నల్లబెల్లి ప్రతినిధి డిసెంబర్ 13 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సిఐ సాయి రమణ,ఎస్ ఐ వి. గోవర్ధన్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికల పరిస్థితుల పర్యవేక్షణ కోసం వరంగల్ జిల్లా ఎస్పీ సున్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు, దుగ్గొండి సీఐ సాయి రమణ మార్గదర్శకత్వంలో నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలో పోలీసు అధికారులు భద్రతా దళాలతో కలిసి పోలీస్ కవాతు నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఎన్నికలను ప్రజలు స్వేచ్ఛా,శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ప్రతి ఓటరు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలు,ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పోలీస్ కవాత్ లో సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు,కానిస్టేబుళ్లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News