Tuesday, March 10, 2026

*ఎన్నికల పేరుతో మోసాలకు యత్నం** ముత్యాలవాడలో గుర్తు తెలియని వ్యక్తుల సంచారం* ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కోరుట్ల సిఐ సురేష్ బాబు —-*

నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని ముత్యాలవాడ ప్రాంతంలో ఎన్నికల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందింది. బుధవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ‘ఎన్నికల పనుల కోసం వచ్చాం’ అంటూ స్థానికుల వద్ద ఆధార్ కార్డులు, వ్యక్తిగత వివరాలు అడుగుతున్నట్లు తెలిసింది.స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని అనుమానంతో ప్రశ్నించడంతో, వారు సమాధానాలు ఇవ్వలేక అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. అనంతరం ఈ విషయం పోలీసులకు తెలియజేయగా, సంబంధిత వివరాలు పోలీసుల దృష్టికి వెళ్లినట్టు తెలిసింది.*అనుమానమొస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి* : కోరుట్ల సిఐఎన్నికల సమయంలో అధికారులు లేదా సిబ్బంది ఎవరికైనా సమాచారం సేకరించాల్సి ఉంటే సరైన గుర్తింపు కార్డులు, అధికారిక పత్రాలు తప్పనిసరిగా చూపిస్తారని కోరుట్ల సిఐ సురేష్ బాబు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నికల పేరుతో వచ్చి వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని ఆయన సూచించారు.ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా మీ ప్రాంతంలో కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరారు.—

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News