Wednesday, March 18, 2026

*ఎన్ హెచ్ ఎం కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ కు డిఎంహెచ్వోకు వినతి**NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 17న హైదరాబాద్లో మహాధర్నా విజయవంతం చేయండి*—————————————–జగిత్యాల టౌన్ –

నేటి సాక్షి(పూరెళ్ల బాపు)…………………………………జిల్లా కేంద్రంలోని ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా కలెక్టర్కు, డిఎంహెచ్వోకు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా AITUC నాయకులు వేన్న మహేష్ మాట్లాడుతూ NHM స్కీంలో దాదాపు 78 క్యాడర్లలో సుమారు 17,541 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరు పేద, మధ్య తరగతి చెందినవారు. ప్రతి నెలా 1వ తేదీన జీతం అందితే తప్ప వారి కుటుంబాలు నడవని పరిస్థితి ఏర్పడిందని ఉన్నారు. గత సెప్టెంబర్, అక్టోబర్-2025 (2 నెలల) జీతాలు అందకపోవటంతో కార్మికుల పరిస్థితి దయానీయంగా ఉన్నదని. కుటుంబ పోషణ కష్టంగా ఉన్నదని అన్నారు .గతంలో అనేక సందర్భాలు జిల్లా స్థాయి అధికారులకు వినతులు ఇవ్వటం జరిగిందని. కాని నేటి వరకు కూడా జీతాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కరించని కారణంగా గతంలో ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిన ఫలితము రానందున ఈ నెల 17 నవంబర్ తేదీన హైదరాబాద్, కోఠి NHM డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం 11 గంటలకు మహాధర్నా చేపట్టామని ఎన్ హెచ్ ఎన్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.వెంటనే ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు పిఆర్సి, ఏరియర్స్ అలాగే ఒకటో తేదీ న వేతనాలు చెల్లించాలని వేంటనే సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News