Friday, February 13, 2026

**ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక**

నేటి సాక్షి. కోదాడబడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు శుక్రవారం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం, కందిబండ గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ,మండల ఇంచార్జులు కూరపాటి సునీల్ మాదిగ, పగిడి కత్తుల ఈదయ్య మాదిగ, బాల చంద్రు మాదిగ,బచ్చకురి ప్రసాద్ మాదిగ ఆధ్వర్యంలో ఆ గ్రామ నూతన కమిటీని అధ్యక్షుడిగా మాతంగి సుధాకర్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను వారు ఖండించారు. కోదాడ పట్టణంలో కర్ల రాజేష్ అనే దళితుడిపై దాడి జరిపి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి కోరారు. ఈ విషయంపై సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునే వరకు ఎమ్మార్పీఎస్ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు త్వరలోనే కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా సభలు నిర్వహిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ నాయకులు సభ్యులు కదలి రావాలని మాదిగల చైతన్యాన్ని చవిచూపే విధంగా కృషి చేయాలని వారి పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా మాదిగల ఉద్దారతకు పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఆదేశాలతో నూతన కమిటీని మాదిగల అభ్యున్నతికి పాటుపడే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మాదిగలంతా ఏక గొంతుతో జాతి అభివృద్ధి పదంలో నడిపించడానికి మందకృష్ణ మాదిగ శ్రమిస్తున్నారని ఆయన శ్రమకు ఫలితంగా మరో మారు దళితులపై దాడి చేయాలంటే వెన్నులో వణుకు పుట్టించే విధంగా డప్పుల దరువు దమ్మెంటో చూపించాలని అన్నారు. ఈ మేరకు పలు గ్రామాల నూతన కమిటీలు ఎంఆర్పిఎస్ సభ్యులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉపాధ్యక్షుడిగా నకరికంటి మధు ,ప్రధాన కార్యదర్శి మాతంగి సురేష్, ప్రచార కార్యదర్శి మాతంగి చెన్నయ్య, కోశాధికారి పోలే శ్రీనాథ్, కార్యదర్శి కొండ్రు లెనిన్ లతోపాటు సహాయం కార్యదర్శిలుగ మెరిగా వెంకటేష్, పేరుపంగు రామ్ చరణ్, మేరిగ పవన్, పోలే రాజశేఖర్, సురేందర్,నారకట్ల రాజేష్,పోలే తిరపయ్య,ఉబ్బపల్లి సురేందర్, కొండ్రు శ్రీను లతో నూతన కమిటీ నీ ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News