Saturday, March 21, 2026

*ఎమ్మెల్యే ఏలూరి కృషితో ఆర్ అండ్ బి రహదారుల అభివృద్ధికి రూ 3.10 కోట్లు*కారంచేడు-ఇంకొల్లు రోడ్డు అభివృద్ధికి రూ 2.20 కోట్లు యనమదల గ్రామంలో బల్లికురవ, పొలూరు రోడ్డు రూ.90 లక్షలు

నేటి సాక్షి,బాపట్ల జిల్లా,(పర్చూరు)పర్చూరు నియోజకవర్గంలో రహదారి మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక కృషితో గ్రామీణ రహదారులను బలోపేతం చేసి ప్రజలు, రైతులకు సౌకర్యంగా ఉండేలా రెండు కీలక పనులకు అనుమతి లభించింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మొత్తం రెండు రోడ్ల నిర్మాణానికి రూ.3.10 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తంగా, అద్వానంగా , కనీసం మరమ్మతులు నోచుకోకపోవడంతో ఎమ్మెల్యే ఏలూరి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. కారంచేడు–ఇంకోల్లు రోడ్డులోని కేశవరపాడు ,జరుబులవారి పాలెం గ్రామాల పరిధిలో CC రోడ్లు, కాల్వలు పనుల కోసం రూ. 2.20 కోట్లు,యనమదల గ్రామ పరిధిలో బల్లికురవ–పొలూరు రోడ్డు పనులకు రూ. 0.90 లక్షలతో సి సి రోడ్డు డ్రైన్ నిర్మాణం చేపట్టనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News