– ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.
– నిన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏ హోదాలో హాజరయ్యారు.
– విలేకరుల సమావేశంలో పాల్గొన్న…
ఎన్ హెచ్ పి ఎస్ జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : గద్వాల: నియోజకవర్గంలో గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో స్పష్టత ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్నారో ఆ దేవుడికే తెలియదని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఎద్దేవా చేశారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
గద్వాల నియోజకవర్గంలో ప్రజల ఓట్ల చేత ఎన్నుకోబడిన స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వర్గ పోరుతో పోటీపడి నడిగడ్డ అభివృద్ధిని మరిచిపోయారని వర్గపోరు మానుకొని ముందు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు.
నిన్న గద్వాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో జరిగిన సమావేశంలోని గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ నాయకుడిగా హాజరయ్యారో తెలపాలని ప్రశ్నించారు. మీ ఇంటి దగ్గర కాంగ్రెస్ పెద్దల ఫోటోలు కట్టుకుని సమావేశంలో పాల్గొన్న మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో నా అనుమతి లేకుండా నా ఫోటోను వాడారని గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు.
టిఆర్ఎస్ పార్టీపై గెలిచి అభివృద్ధి కోసం వెళ్తున్నానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గ ప్రజలను మోసం చేసే కుట్రలు బహిరంగంగా కనిపిస్తున్నాయని అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే రాత్రి ఎక్కడ ఉంటారో పగలు ఎక్కడ ఉంటారు దేవుడికే తెలియని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు.
గద్వాల ప్రజలు ఎమ్మెల్యే భూటాకాన్ని తెలుసుకోవాలని మీరు కాకుండా వేరే బహుజన నాయకుడు ఈ రకంగా చేస్తే మాత్రం అనేక రకాలుగా రాళ్లు విసురుతారని, ఇలాంటి నాయకుల వ్యవహార తీరుపై ప్రజలు నిలదీయాలని అన్నారు. ఇలాంటి నాయకులకు ఏ పార్టీ వత్తాసు పలికినా తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
అభివృద్ధి సంక్షేమమని అనేక రకాలుగా బూటకానికి తెరలేపి, నియోజకవర్గం ప్రజలను మోసానికి గురి చేస్తూ, ఎవరికి కూడా నిజమైన పేదలకు సంక్షేమ ఫలాలు అందానీయకుండా స్థానిక ఎమ్మెల్యే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి మీ పాలనలో నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపెట్టాలని, మీ రాజకీయ స్వలాభం కోసం నియోజకవర్గంలో ఉన్న ప్రజలను మోసం చేసే కపట నాటకాలను మానుకోవాలని, లేనియెడల వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మీరు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టంగా బహిరంగంగా తేల్చి చెప్పాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, జిల్లా నాయకులు రంగస్వామి,వెంకట్రాములు, మల్ధకల్ మండల అధ్యక్షుడు విష్ణు, నాయకులు తిమ్మప్ప,చిన్న రాముడు, వెంకటేష్, ఆశన్న,గోపాల్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.





