Wednesday, March 18, 2026

ఎమ్మెల్యే ని అవమానించారంటూ జనసైనికుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం..కూటమి కోసం ఎన్ని అవమానాలు భరించడానికైనా సిద్ధం.. బత్తుల బలరామకృష్ణ

నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 19~అన్నమయ్య జిల్లా -:- రాజమండ్రిలోని అదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను అవమానించారంటూ జన సైనికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ గేట్ బయట కట్టిన తమ ఫ్లెక్సీలు తొలగింపుతో జనసైనికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన మహిళా నేత, ఎమ్మెల్యే బత్తుల సతీమణి వెంకట లక్ష్మిని యూనివర్సిటీ నిర్వాహకులు అడ్డుకోవడంతో వివాదం ముదిరింది. ఒకానొక దశలో బత్తుల బలరామకృష్ణ భార్యను మెడపై చేయి పెట్టి తోసేసారని జన సైనికులు, వీర మహిళలు మండిపడ్డారు. నారా లోకేష్ కార్యక్రమం కాసేపట్లో మొదలు కానుండగా ఈ గొడవ చోటు చేసుకుంది. జన సైనికులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సద్ది చెప్పారు. కూటమి కోసం అవమానాలు భరించేందుకు సిద్ధంగా ఉన్నామని బత్తుల బలరామకృష్ణ అన్నారు. యూనివర్సిటీ ఉద్యోగి ఒకరు రాజానగరం పోలీసుస్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. ఎమ్మేల్యే మాత్రం మంత్రి పర్యటనకు ఎటువంటి ఆటంకం కలగకూడదని, తర్వాత ఈ వివాదానికి సంబంధించి చర్యలు తీసుకుందామంటూ జన సైనికులను సముదాయించారు..~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News