నేటి సాక్షి (భూమయ్య) మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నిర్లక్ష్యం వల్ల గత వారం రోజుల క్రితం నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్చారం మండలంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అభివృద్ధి చేయలేదని ఆరోపణలతోనే కాంగ్రెస్ పార్టీలో చేరామని కొల్చారం మండలం వివిధ గ్రామాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు కార్యకర్తలు తెలిపారు. అలాగే మండల అభివృద్ధికి కొల్చారం మండలం బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా ఎటువంటి సహకారం చేయకపోవడం వల్లనే కొల్చారం మండలంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ యువత నాయకులకు కూడా నిరాశ చెందుతున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కొల్చారం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా ఆయన సొంత పనుల గురించి పార్టీలో చేదోడు వాదోడుగా పనిచేస్తున్నారు తప్ప ప్రజల గురించి పనులు చేస్తున్న పాపాన పోలేదని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కొల్చారం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ గుప్తా మార్పు రాకపోతే కొల్చారం మండలంలో బిఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు కావడం ఖాయమని వివిధ గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.





