నేటి సాక్షి – జగిత్యాల
( రాధారపు నర్సయ్య )
జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్ ఎడమ కాలుకు ప్యాక్చర్ కావడంతో, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం సాయంత్రం ఆయనను ప్రత్యేకంగా పరామర్శించారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి, అవసరమైనంత వరకు వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.





