Tuesday, February 17, 2026

*ఎమ్మెల్యే సంజయ్ కు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారా…?**సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవు..**కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా….**మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )……………………………………కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లకు పైగా ఉండి కార్యకర్తలు, నాయకులు, జగిత్యాల నియోజకవర్గం కోసం ఎమ్మెల్యే గా ఓడినా, గెలిచినా పనిచేస్తున్నానని బీ ఆర్ ఎస్ నుండి గెలిచినా ఎమ్మెల్యే సంజయ్ వల్ల నాకు వేధింపులు తప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.సోమవారం జగిత్యాల ఇందిరా భవన్ లో కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.*జీవన్ రెడ్డి మాట్లాడుతూ…*భవిష్యత్ ఏంటో గోచరించట్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.అవమానాలు ఇంకెంత కాలం భరించాలని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.ఈజగిత్యాల మున్సిపల్ ఎన్నిక ముగింపు కాదు, ఎమ్మెల్యేగా సంజయ్ ఉన్నంత కాలం నాకు వేధింపులు తప్పవని పేర్కొంటూపవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు రాసిచ్చారా? అని అధిష్టానాన్ని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ నియోజకవర్గం పట్టా రాసిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్పీకర్ ఏమో జగిత్యాల ఎమ్మెల్ సంజయ్ కుమార్ యే పార్టీ మారలేదని బీ ఆర్ ఎస్ లో ఉన్నాడని అంటున్నాడు, కానీ ఎమ్మెల్యే సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాడు జీవన్ రెడ్డి మండిపడ్డారు.అధినాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని సూచించారు.జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో ఎలా వుందో? పార్టీ పరిస్థితి అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News