నేటి సాక్షి, రాజేందర్‌నగర్: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి హైదర్షా కోట్ గ్రామంలో ఎర్రకుంట పూడికలు తీత పనులు సాగుతున్నాయి. శనివారం పనులను కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ చంద్ర శేఖర్, టింకు రెడ్డి పరిశీలించారు. వారి వెంట డీఈఈ యాదయ్య, ఏఈ రాజు, నాయకులు సందీప్ ముదిరాజ్ ఉన్నారు.