Wednesday, February 11, 2026

ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్……..జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు….ఎన్నికలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు

నేటి సాక్షి నారాయణపేట, ఫిబ్రవరి 11 రిపోర్టర్, ఇమామ్ సాబ్ ),నారాయణపేట జిల్లా పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు నారాయణపేట, మక్తల్, కోస్గి , మద్దూర్ నాల్గు మున్సిపాలిటీలలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ తెలిపారు. బుధవారం రోజు మక్తల్ లోని జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో, గార్ల పల్లి లో మరియు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్ పి హెచ్ ఎస్ గర్ల్స్ హై స్కూల్లో నీ పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సరళి, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్త్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ స్వయంగా పరిశీలించారు.ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుత వాతావరణం మున్సిపల్ ఎన్నికలు కొనసాగేలా చూడాలని అలాగే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మున్సిపల్ ఎన్నికలు సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఓటు వేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, క్యూ లైన్ లో ఉండేలా చూడాలని ఆయన తెలిపారు.ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీస్ విభాగం హై అలర్ట్‌లో కొనసాగాలని, శాంతి–భద్రతలను కాపాడడంలో ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యతగా ఉండాలని తెలిపారు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు.ఎస్పీ తో పాటు డీఎస్పీ మహేష్, సీఐ లు శివశంకర్, రవి బాబు, రామ్ లాల్, ఎస్ఐ లు నరేష్, వెంకటేశ్వర్లు, భాగ్య లక్ష్మి రెడ్డి, బిజూ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News