*నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ప్రజల నుండి వచ్చిన ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఇంచార్జి జాయింట్ కలెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ దరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్సులతో మంగళవారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు, లే అవుట్లు క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ ద్వారా ప్రజలకు అవకాశం కల్పించిందని తెలిపారు. దీంతో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలో రోడ్లను, పుట్ పాత్ లు ఆక్రమించడం జరగకుండా నిత్య పర్యవేక్షణ చేయాలని తెలిపారు. భవన నిర్మాణాలు ప్లాన్ ప్రకారం కాకుండా డీవేయేషన్ చేసి నిర్మాణాలు చేపడుతున్న వాటిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని తెలిపారు. అలాగే అనధికారిక ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయకుండా చూడాలని అన్నారు. పెండింగ్ ఉన్న ప్రకటనల పన్నులు వసూలు చేయాలని అన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఏసీపీ లు మూర్తి, మధు, సర్వేయర్లు కోటేశ్వరరావు, గురువా రెడ్డి, మేనేజర్ హాసిమ్, టి.పి.ఎస్. వంశి, టిపిబివో లు, ప్లానింగ్ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.





