నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని ఎస్ఆర్ డిజి ప్రైవేటు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు పుస్తకాలు, నోట్ బుక్స్, బెల్ట్, టై వంటివి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న మండల విద్యార్థికారి బాలు నాయక్ మంగళవారం పాఠశాలకు చేరుకొని నిర్ధారణ చేసుకొని పాఠశాలలో ఉన్న పుస్తకాల రూమ్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్రైవేటు పాఠశాలలో పుస్తకాలు, నోట్ బుక్స్, టై, బెల్స్ట్ అమ్మకాలు జరిపితే, ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని, ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఫీజ్ ల వివరాలు నోటీస్ బోర్డ్ లో పొందుపర్చాలని ఆదేశించారు.

