నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)ఎస్ఆర్ పురం మండల అభివృద్ధికి సహకరిస్తానని గ్రామ సచివాలయ డిప్యూటీ ఎంపీడీవో మురళి అన్నారు. మంగళవారం ఎస్ఆర్ పురం మండలం కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవో గా మురళి బాధ్యతలను స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి సీనియర్ సహాయకులుగా పనిచేస్తూ ప్రమోషన్ మీద ఎస్ఆర్ పురం మండలం గ్రామ సచివాలయ డిప్యూటీ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. మండలంలోని నాయకులు అధికారులను సమన్వయం చేసుకొని మండల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఆయనకు పలువురు నాయకులు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.





