నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*వెదురు కుప్పం* చిత్తూరు జిల్లా,వెదురుకుప్పం మండలం, జక్కాదోన గ్రామం లోని గిరిజనులకు సంబంధించిన ఇండ్ల స్థలాలను ఆక్రమించుకున్న స్థలాన్ని , సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, దళిత హక్కుల పోరాట సమితి డి హెచ్ పి యస్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి చంద్ర,జీ.డి. నెల్లూరు నియోజకవర్గం అధ్యక్షులు పి.రఘు లు ఇంటి స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు మాట్లాడుతూ చిత్తూరుజిల్లా, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలం జక్కదన్న గ్రామం లోని గిరిజనులకు ఎస్టిలకు 1989 సంవత్సరంలో ఇంటి పట్టా స్థలం ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని ,ఆ గ్రామంలోని అగ్రవర్ణాల రైతు 36 సంవత్సరాల కావస్తున్న,ఇప్పుడు ఆక్రమించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది . అగ్రవర్ణాల రైతు ఎస్టీలకు ఇచ్చిన,ఇంటి పట్టా స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా ,గిరిజనులపై మహిళ అనేది చూడకుండా దాడి చేసి కులం పేరు తో దూషించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారికి ,వెదురుకుప్పం మండల తాసిల్దార్ గారికి వినంచుకున్న గిరిజనులకు న్యాయం జరగడం జరగడంలేదని, వాపోయారు వెదురుకుప్పం మండల తాసిల్దారు మేజిస్ట్రేట్ అయినటువంటి తాసిల్దార్ గారు జోక్యం చేసుకొని 1989లో గిరిజనులకు రెవెన్యూ అధికారులు మంజూరు చేసిన ఇంటి పట్టామేరకు, సర్వే చేసి ఆక్రమణకు గురికాకుండా చూడాలని, గిరిజనులపై దాడి చేసి ,కులం పేరుతో దూషించిన ఎస్టి రైతుపై కేసు నమోదు చేసి, అగ్రవర్ణాల వారి నుండి గిరిజనులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వెదురు కుప్పం మండల తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు





