నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 5చౌడేపల్లి మండలం, దుర్గసముద్రం గ్రామపంచాయతీ, డి.రాజులూరు నందు సుమారు ఇరవై కుంటుంబాల ఎరుకల ఎస్టీ కులానికి చెందినవారు జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం వారు వారికి ఒటికుంట లో సర్వే నెంబర్ 544 నందం 0.56 సెంట్ల భూమిని స్మశాన వాటిక కోసం కేటాయించినది. అందులో రెండుమూడు తరాలుగా తమవారు చనిపోతే ఖననం చేసుకుంటుండెవారు.ఈమద్య కాలంలో భూముల రేట్లు అధికమవ్వడంతో, ఎక్కడైనా భూములు కనిపిస్తే తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమణ చేస్తున్నారు.ఈనేపత్యంలో ఎస్టీ స్మశాన వాటికకు వెళ్ళే దారిని, స్మశానాన్ని ఆక్రమించారు.ప్రస్తుతం అక్కడ ఖననం చేసిన, గుర్తుగా నాటిన సమాధి రాళ్ళను సైతం పీకివేస్తున్నారు. ఈ విషయం పైన గ్రామస్తులు శుక్రవారం స్థానిక తాహాశిల్దార్ ను కలసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన తాహాశిల్దార్ తక్షణచర్యలు తీసుకోవాలని, గ్రామరెవిన్యూ అధికారులకి,సర్వేయర్లకు తెలియజేశారు.శనివారం ఉదయాన్నే సదరు స్మశానవాటికను సర్వే చేయిస్థామని ఆవిడ తెలియజేశారు. గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.





