నేటి సాక్షి చెన్నూర్ నియోజకవర్గంలో బీసీ – ఎస్సీ – ఎస్టీ వర్గాల ఐక్యతను బలపరచే దిశగా బిసి,ఎస్సి, ఎస్టీ ఐక్య కార్యాచరణ కమిటీ (జే ఏ సి) ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం, హక్కులు, అధికార సాధన మరియు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సిద్ది రమేష్ యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించరు,ఈ సమావేశంలో మాట్లాడిన నాయకులు, మేధావులు, యువత ప్రతినిధులు మాట్లాడుతు చెన్నూరు నియోజకవర్గంలో మెజారిటీగా ఉన్న బహుజన వర్గాలు ఇప్పటికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక అన్యాయాలను ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల నుంచి శాసనసభ వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, అభివృద్ధి ఫలాలు అందని పరిస్థితి ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా నిలబడి ప్రశ్నించే గొంతుకగా జేఏసీ పని చేయాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను విస్తరించి ప్రజా సమస్యలపై ఉద్యమాత్మక కార్యాచరణ చేపట్టాలని సమావేశం తీర్మానిచారు కార్యక్రమంలో మంత్రి మల్లేష్ మాదిగ, మాజీ జెడ్పిటిసి తిరుపతి, అడ్వకేట్ జెక సంజీవ్, మాజీ సర్పంచ్ పెద్దింటి రాజన్న , గుర్రం శ్రీనివాస్, , అక్కల రాజన్న యాదవ్, పరస శ్రీనివాస్, మాదాసు కిష్టయ్య, గుర్రం సమ్మయ్య, కొడారి ఐల్లయ్య యాదవ్, భూసారి పవన్, దేనవేన రాజేష్, MRPS మండల నాయకులు రమేష్ మాదిగ, పడాల వెంకన్న, పడాల శ్రీనివాస్, మణియశెట్టి మల్లయ్య, పిల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

