Friday, March 20, 2026

*ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తప్పవు*:— *జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు లింగాల నాగరాజు*..

నేటి సాక్షి 26 పాములపాడు:–మెనూ ప్రకారం భోజనం వసతులు కల్పించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు తెలియచేస్తామని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో ఉన్న బాలికల వసతి గృహం తనిఖీ చేసి భోజనం కూరగాయలు తదితర విషయాలపై తనిఖీ చేసి ఈ సందర్భంగా లింగాల నాగరాజు మాట్లాడుతూ ఈరోజు మెనూ ఉదయం టిఫిన్ జీరా రైస్ కూరగాయల సాంబారు అయితే జీరా రైస్ లో జిలకర తప్ప ఏమీ లేదని అన్నం కూడా చితికిపోయిందని హాస్టల్ వర్కర్స్ నిర్లక్ష్యం చేయకుండా వంటలు మంచిగా చేయాలని పిల్లలు సంతృప్తిగా తినే విధంగా వంటకాలు ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వం పిల్లలకు సన్న బియ్యం మంచి కూరగాయలు మెనూ ప్రకారం పెట్టి చదువులో పిల్లలను బాగా రాణించాలని ఆదేశాలిస్తే కొంతమంది వార్డెన్లు నిర్లక్ష్యం వహిస్తూ బయట పనులకే ప్రాముఖ్యత తీస్తున్నారని హాస్టల్లో ఉండకుండా బయట ప్రపంచానికి పరిమితమైతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.సరిగా కల్పించకపోతే వార్డెన్లపై జిల్లా కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News