Sunday, March 15, 2026

*ఎస్సీ రిజర్వేషన్లను యధావిధిగా ఉంచాలి.* ఎం ఆర్ పి ఎస్ జాతీయ ఉపాధ్యక్షులు *-పుర్ర ప్రభాకర్ మాదిగ* మెదక్ జిల్లా.కొల్చారం…

నేటి సాక్షి (భూమయ్య)ఎస్సీ రిజర్వేషన్లను మార్చొద్దు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ లో వేసిన ఎస్సీ రిజర్వేషన్లు అదేవిధంగా ఉంచాలని రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి యధావిధిగా ఉంచాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు ఎస్సీ రిజర్వేషన్లు ఇప్పుడిప్పుడే రాజకీయ అందుతున్న సమయంలో రిజర్వేషన్లు మార్పు సరికాదు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు ఏర్పడక ముందు జిల్లా స్థాయిలో సమితి ప్రెసిడెంట్ సమితి మెంబర్లు బ్లాక్ మెంబర్లు ఉండేవి ఆ సమయంలో అసలు ఎస్సీలకు ఈ రాజకీయాలు అస్సలు తెలిసేదే కాదు, 1980-1981 లో జిల్లా మండల స్థాయిలు ఏర్పడ్డక ఎంపీటీసీ జడ్పిటిసి ఎంపీపీ మండల అధ్యక్షులు జడ్పీ చైర్మన్ వచ్చినప్పుడు నుండి కొద్ది గొప్ప అవకాశాలు అందుతున్నాయి, అవి అందుతున్నాయి అంటే, కీలక పదవులు లేమి కాదు, ఎంపీపీ లేదా జడ్పిటిసి అంతకంటే మించి ఉంటే, ఈ అధికార పార్టీ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలమైన చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటించుకుంటున్నారు, అందుకని సెప్టెంబర్ లో వేసిన ఎస్సీ రిజర్వేషన్లను యధావిధిగా ఉంచాలి. అక్టోబర్ నెలలో సుప్రీంకోర్టు మరియు, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో చూస్తే, గ్రామ వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీ సీట్ల వరకు ఎస్సీ రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అని సూచిస్తుంది భారత రాజ్యాంగం అంటే గత 40 సంవత్సరాల క్రితం ఎస్సీ జనాభా కి, చాలా తక్కువతక్కువ ఉన్నప్పటికీ ఎంపీపీ లేదా జెడ్పిటిసి ఎంపీటీసీ సర్పంచ్ అందేవి కాదు అందుకని సెప్టెంబర్లో ప్రకటించిన ఎస్సీ రిజర్వేషన్లు మార్చవద్దు అంటున్నం ,లేదా ఎస్సీ రిజర్వేషన్లు మారుస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయక తప్పదు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News