నేటిసాక్షి, కరీంనగర్: కరీంనగర్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ బండ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు 5 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతి, భోజనం, పుస్తకాలు, స్టైఫండును అందజేస్తామన్నారు. బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు శిక్షణ ఉంటుందని, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు http://tsstudycircle.co.in/ ద్వారా దరఖాస్తు ఈనెల 20 లోగా చేసుకోవాలని సూచించారు.

