నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 20~అన్నమయ్య జిల్లా :- ఆ తహశీల్దార్ ఎక్కడ ఉన్నా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోతున్నారు. ప్రాంతం ఏదైనా సరే ఆమె తీరు, ప్రవర్తనలో ఏ మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఆమె తన కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పై కాకుండా సమస్యల కోసం కార్యాలయానికి వెళ్లే ప్రజల పై కూడా నోరు పారేసుకుంటూ నిత్యం వార్తాపత్రికలు, న్యూస్ చానల్స్ కు ఎక్కుతుంది. అసలు ఆ తహశీల్దార్ ఎవరు. ఎక్కడ ఉంటుందో ఓ లుక్కేద్దాం. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండల కేంద్రమైన స్థానిక తహశీల్దార్ గా పనిచేస్తున్న ఖాజాబీ అనునిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. తనకు 2 నెలల నుంచి జీతాలు చెల్లించకుండా తనతో వెట్టిచాకిరి చేయిస్తూ వేధింపులకు గురిచేస్తుందంటూ తహసిల్దార్ ఖాజాబీ పై అటెండర్ అరుణ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. జీతం బిల్లులు పై సతకం పెట్టకుండా ఇబ్బందులకు గురి గురిచేస్తుందంటూ తహసిల్దార్ కార్యాలయం వద్ద మీడియా ఎదుట అటెండర్ అరుణ వాపోయారు. తాను 6 నెలల క్రితమే రాజంపేట నుంచి డిప్యూటేషన్ పై వీరబల్లి కి వచ్చానని అప్పటి నుంచి తహసిల్దార్, అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు సైతం తనను వేధింపులకు గురిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు అంటూ అటెండర్ అరుణ మీడియా ఎదుట వాపోయారు. వాళ్లకు సపర్యాలు చేయడమే దినచర్య అని మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యింది. మీడియా ఎదుట అటెండర్ అరుణ మాట్లాడుతుండగా ఆమెపై చేయి చేసుకోవడానికి వచ్చి లోపలికెళ్ళంటూ అటెండర్ అరుణ పై మీడియా ఎదుటే తహశీల్దార్ ఖాజాబీ చిందులేసింది. వీడియోపై దౌర్జన్యం చేస్తూ వీడియో తీయొద్దంటూ మీకు ఇక్కడికి ఎవరమ్మన్నారంటూ మీడియా పై కూడా తహశీల్దార్ ఖాజాబీ తన ప్రతాపాన్ని చూపింది. తహసిల్దార్ ఖాజాబీ ని వివరణ అడిగినందుకు వెళ్తే నా రూటు ఇంతే. నా రూటే సపరేటు. మీకు ఇష్టం వచ్చింది రాసుకోండంటూ ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరంటూ దానికి వత్తాసు పలకడానికి మీరంతా వచ్చారా అంటూ మీడియాపై తన అక్కస్సును వెలగక్కింది. కార్యాలయం కు వచ్చిన ప్రజలను విచారిస్తే ప్రతి అందరిపై ఇలాగే వ్యవహరిస్తా ఉందని వచ్చిన వారికి సరైన గౌరవం కూడా ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తా ఉందని పనితనం లేకపోగా వచ్చిన వారిపై కసుబుసు లాడుతుందని ప్రజలు వాపోయారు. మీడియాపై చిందులేసి ప్రజల వద్ద విమర్శలు పాలవుతున్న ఈమెపై చర్యలు తీసుకోవాలని మీడియా కోరుకుంటుంది..~~~~~~~~~~~~~~~~~~





