Saturday, March 21, 2026

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తోంది..ఒకరి జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న గిల్టీ కూడా కూటమి ప్రభుత్వ నేతలకు లేదా..!మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ తప్పు చేసిన శిక్షేది..తప్పు చేసిన వాడిని బొక్కలో వేయాలా వద్దా.. వైయస్ జగన్

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 04 ~అన్నమయ్య జిల్లా :-: చంద్రబాబు బెయిల్‌ కండీషన్స్‌ను ఉల్లంఘిస్తున్నారని ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. వైయస్ జగన్ గురువారం తాడేపల్లి లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఉద్యోగులకు ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి మాత్రమే ఇస్తున్నారని డీఏ అరియర్స్ రిటైర్మెంట్ తర్వాత ఇస్తామనటం చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రమే చెల్లిందన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా జీవోలు ఇవ్వటంతో ఉద్యోగ సంఘాల అభ్యంత రాలతో ఉపసంహరించుకు న్నారని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో మెరుగైన పీఆర్ సీ అన్నారు. ఇంత వరకు పీఆర్ సీ చైర్మన్ ను కూడా నామినేట్ చేయలేదు. మెరుగైన పీఆర్ సీ ఒక బూటకమని జగన్ తేల్చి పడేశారు. ఐఆర్ లేదు. పీఆర్సీ లేదు. ఓపీఎస్ కూడా లేదు. పీఆర్ సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, ఇతర రూపాల్లో ఉద్యోగులకు 35 వేల కోట్లు బకాయిలు పడ్డారని గత ప్రభుత్వ హయాంలో ఆప్కాస్ ద్వారా ఒకటవ తేదీనే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని ఆలయాలల్లో లేబర్ కాంట్రాక్టులు కూడా చంద్రబాబు బందువులు ఇచ్చుకున్నారని వైయస్ జగన్ ధ్వజమెత్తారు. గెస్ట్ లెక్చరర్స్ కు 8 నెలలుగా జీతాలు లేవని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ముందుకు వెళ్తున్నామని విశాఖ ఉక్కు. ఆంధ్రుల హక్కు అని గత ప్రభుత్వ హయాంలో ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని తీర్మానం చేసి పంపామని ప్లాంట్ మైన్స్ ఇవ్వమని కేంద్రాన్ని కోరామని ఎన్నికల ముందు విశాఖ ఉక్కుపై ఒకలా అధికారాన్ని చేపట్టాక ఇప్పుడు మరోలా చంద్రబాబు మాట్లాడుతున్నారని వైయస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాటలు చూస్తే సినిమాల్లో చూసే విలన్ పాత్రకు నిదర్శనమని ఎన్నికల ముందు వీర డైలాగులు చెప్పాడని ఇవాళ ప్రశ్నిస్తే పనిచేయకుండా జీతాలు ఇవ్వాలా అంటున్నాడని మరి గట్టిగా వారిని భయపెడుతూ తమాషాలు చేయొద్దు. పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తామని బెదిరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు మైన్స్ లేకపోవటమే కారణమని విశాఖ ఉక్కు కంటే సెయిల్ బాగా లాభాల్లో ఉండటానికి ఐరన్ ఓర్ ఉండటమే కారణమని మేము అనేక సార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఐరన్ మైన్స్ ఇవ్వాలని కోరామని వాళ్లేమో విశాఖ ప్లాంట్ కు మైన్స్ అడగకుండా ప్రైవేట్ ఆద్వర్యంలో పెడుతున్న కంపెనీకి మైన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని జగన్ వివరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో వీళ్లే ఉన్నారు. కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు వీళ్లు పెట్టినవే. పూజలు చేసి మరి కల్తీ మద్యం ఫ్యాక్టరీలు మొదలుపెట్టారు. వీరే తయారు చేస్తారు. బాటిల్స్ మీద వీళ్లే లేబుల్స్ వేస్తారు. వాళ్ళ బెల్ట్ షాపుల్లో నకిలీ మధ్యాన్ని ఉంచి అమ్ముతున్నారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆద్వర్యంలోనే ఆయన కనుసన్నలోనే నకిలీ మద్యం తయారీ వ్యవహారమంతా నడిచిందని జగన్ ఆరోపించారు. కుటీర పరిశ్రమల తరహాలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలు మొదలుపెట్టారు. కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది టీడీపీ నాయకులే. ఈ కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్లే. వీళ్ళ ప్రభుత్వంలో పని చేసిన ఎక్సైజ్ పోలీసులకూ భారీగా ముడుపులు వాళ్ల ప్రోత్సాహంతో తయారీ. సరఫరా అన్నీ వీళ్లు చేసిందని వైయస్ జగన్ ఆరోపించారు. వీళ్ల రెడ్ బుక్ పాలనలో వీళ్ళు కాక ఎవరికైనా నడిపే దైర్యం ఉందా అంటూ జగన్ ప్రశ్నించారు. ఇంత నడిపి పాత్రధారి సూత్రధారి తంబళ్లపల్లి టీడీపీ నేత దాసరపల్లి జయచంద్రారెడ్డిని వదిలిపెట్టి మా పార్టీ నేత జోగి రమేష్ కు ఎటువంటి సంబంధం లేకున్నా ఆయనపై నేరాన్ని మోపి అరెస్ట్ చేశారు. ఇంత చేసిన దీనికంత కారణమైన దాసరపల్లి జయచంద్రారెడ్డి అండ్ కో ఇంత వరకు అరెస్ట్ కాలేదు. ఈయనను ఎక్కడ దాచి పెట్టారన్నది ఇంతవరకు తెలియటం లేదు. ఈ కల్తీ నకిలీ మద్యం తయారీ అంత మొత్తం వీళ్ల కనుసన్నల్లోనే జరిగింది. అన్నీ వీళ్లే చేస్తూ తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో మా మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఒక మాజీ మంత్రి పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని జగన్ ప్రశ్నించారు. ఒక దొంగే దొంగ దొంగ అంటున్నారు. ఆఖరుకు వాళ్ళ కొడుకు రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నాడని అతన్ని కూడా కేసులో పెట్టారు. మాచర్ల కు చెందిన మా పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై అక్రమ కేసులు పెట్టారు. వీళ్ల హయంలో టీడీపీ గ్రూపు తగదాలతో చంపుకుంటే మా పార్టీ లీడర్ పిన్నెల్లి ని వాళ్ళు ఇరికించారు. ఘటనకు కారణం టీడీపీ గ్రూపు తగాదాలే కారణమని సాక్షాత్తు ఎస్పీ కూడా చెప్పారు. చనిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. చేసింది కూడా టీడీపీ వాళ్ళే. మా పార్టీ నేతలకు ఏం సంబంధం. ఆ ఎస్పీ ఇష్యూపై ఒక ట్వీట్ కూడా చేశారు. ఆధి పత్య పోరులో ఇద్దరు టీడీపీ నేతలు మృతి అని వాళ్ళ పేపర్స్ లో కూడా వచ్చింది. అసలు న్యాయం ఎక్కడుంది. ఇలాంటివి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎన్నికల సమయంలో రిగ్గింగ్ ను అడ్డుకున్నందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైళ్లో పెట్టారు. విశాఖలో మా పార్టీ విద్యార్ధి నేత కొండారెడ్డి ఇలాంటి దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. విద్యార్ధి అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టారు. టిఫిన్ చేసేందుకు వెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీ ఫుటేజ్ ఉంది. ఎక్కడో అరెస్ట్ చేసి ఎక్కడో పట్టుకున్నట్లు చూపించారు. ఒకరి జీవితాన్ని నాశనం చేస్తున్నామన్న గిల్టీ కూడా లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు ఆ కేసును నీరుగార్చేందుకు లేని కేసు సృష్టించారు. ఆయనది ప్రైవేట్ మాఫియా. ప్రైవేట్ కథ. మాది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచింది. లేని లిక్కర్ కేసు పేరుచెప్పి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను అరెస్టు చేశారు. ఈ కేసులో డబ్బులు పట్టుకున్నామని చూపించారు. ఆ డబ్బులు ఎప్పటివో చెప్పాలని పిటిషన్ వేయటంతో మిగతా డబ్బులో కలిపేశారు. ఆ డబ్బులు పరిశీలిస్తే అవి ఒక ప్రైవేట్ కాలేజీ డబ్బులని తెలిసిపోతాయని భయపడ్డారు. అనేక మంది మా పార్టీ నేతలను అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణ మురళి, కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారిని కూడా అరెస్ట్ చేశారు. సాలూరులో మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ వేధించాడని మండల ఆఫీస్ లో పనిచేసే ఒక మహిళ ఉద్యోగి కేసు పెట్టేందుకు వెళ్తే తీసుకోలేదు. అసభ్య పదజాలంతో వేధించినా కనీసం కేసు కూడా నమోదు చేయలేదు. అలాంటి వారిని ఏం చేయాలి. బొక్కలో వేయాలి కదా’ అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు.~~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News