Monday, March 16, 2026

ఏప్రిల్ 4న కిష్టాపూర్ లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ.జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల. భారత గడ్డపై హరిత విప్లవంతో కరువును చీల్చి చెండాడిన మహా గొప్ప నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలీస్ వెంకట్ రెడ్డి. ముఖ్య అతిథులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ .

నేటి సాక్షి వికారాబాద్ :మహనీయులు రాజకీయ కోవిదులు భారత ఉప ప్రధానమంత్రి హరిత విప్లవ ప్రధాత కార్మిక పక్షపాతి భారత దేశంలో అతి చిన్న వయసులో ముఖ్యంగా దళిత సామాజిక వర్గం లో పుట్టి ఎన్నో పదవులను అధిరహించిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంతేకాకుండా ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం పార్లమెంట్ మెంబర్గా పనిచేసిన ఘనత ఆయనది అదేవిధంగా ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటరీగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ శాఖ మంత్రిగా ఉండి బంగ్లాదేశ్ కి విముక్తి కలిగించిన మరో గొప్ప ఘన కీర్తిని అందుకున్న మహానీయులు ఆయన విగ్రహాన్ని ఏప్రిల్ నాలుగవ తేదీన కిష్టాపూర్ గ్రామం దోమ మండలం బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాది విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ లోని బారాసోసియేషన్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోలీస్ వెంకటరెడ్డి జాయింట్ సెక్రటరీ పి ఆనంద్ సీనియర్ న్యాయవాదులు లవ కుమార్ గోవర్ధన్ రెడ్డి రామచంద్ర రావు జనార్దన్ రెడ్డి అశోక్ కుమార్ మహేష్,శుభప్రద్ పటేల్ మహేష్ రెడ్డి, చైతన్య కిరణ్, అశోక్,సిహెచ్ వెంకటేష్, యూత్ అధ్యక్షులు యాదగిరి ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News