Sunday, March 15, 2026

ఏసీపీ మాధవిని మర్యాదపూర్వకంగా కలిసిన జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి


నేటి సాక్షి-హుజురాబాద్:
హుజూరాబాద్ ఏసీపీ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వాసంశెట్టి మాధవి ని జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి సరిత – జయపాల్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ని శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సరిత జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతలను కాపాడటంలో మాధవికి మంచి పేరు ఉందని, అలాగే భవిష్యత్ లో మరింత పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఈ నెల 7న మండలంలోని చెల్పూర్ లో జరిగే కంటి వైద్య శిబిరానికి హాజరు కావాలని ఏసీపీని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News